హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద Cyber fraudని చేధించినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎస్బిఐ ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ Call centers ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా Stephen Ravindra మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్ఫూపింగ్ యాప్ దారా ఎస్బిఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు.
ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఎస్బిఐ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కాల్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదనట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
SBI agents నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకుని Credit card దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్బిఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు Spoofing app వాడుతున్నారని.. ఈ యాప్ వాడకంలో ఫర్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని సీపీ తెలిపారు.
1860 180 1290 నెంబర్ ను స్ఫూఫింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30 సెల్ ఫోన్లు, మూడు లాప్టాప్లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. Dhani, Lone Bazaar పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
Fake website లాగిన్ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకుని ఆ తర్వాత రుణం మంజూరు అయినట్లు చెబుతారని.. ప్రాసెసింగ్ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారని వివరించారు. ఈ ముఠాలో 14 మందిని అరెస్టు చేసి వారి నుంచి 17 ఫోన్లు, మూడు ల్యాప్టాప్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
(From Asianet News 3 Dec 2021)
Discussion (0)