Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for ట్విస్ట్ అమ్మా మొగుడు
(స‌బ్ టైటిల్స్ః Twist's mother's husband)

ట్విస్ట్ అమ్మా మొగుడు (స‌బ్ టైటిల్స్ః Twist's mother's husband)

Sridhar Bollepalli

నేను గూఢ‌చారిన‌ని అబ‌ద్ధం చెప్పి, రాధ‌ని న‌మ్మించి నా ప‌రువు నిల‌బెట్టావ్‌. నీ రుణం ఎలా తీర్చుకోను భ‌ర‌త్‌?

ఎదుటివాళ్ల రుణం ఎలా తీర్చుకోవాలీ అనే మీమాంస‌ని జ‌యించ‌డానికే దేవుడు క‌రెన్సీని క‌నిపెట్టాడు. ఒక ప‌ది ల‌క్ష‌లు నా మొహాన పారేస్తే, నా దారిన నేను పోతాను.

అలా చూలాగ్గా ప‌దిల‌క్ష‌లు పారేసేంత సీను నాకుంటే అస‌లు గూఢ‌చారి వేషం ఎందుకు క‌ట్టాల్సొచ్చేది. నా డ‌బ్బు, మంచిత‌నం స‌రిపోయేవిగా రాధ‌కి?

అదంతా నాకు తెలీదు గోపీ. మ‌ర్యాద‌గా ప‌దిల‌క్ష‌లు ఇవ్వు. లేదంటే, అస‌లు నిజం రాధ‌కి చెప్పేస్తా.

అవేం మాట‌లు భ‌ర‌త్‌. ప‌దేళ్ల‌నుండీ ఎఫ్బీలో ఫ్రెండ్సుగా వుంటున్నాం. నీ పోస్టుల‌కి ల‌వ్వు, లాఫు త‌ప్ప ఏనాడైనా లైకు కొట్టానా? ఆఖ‌రికి నీకొచ్చిన కామెంట్ల‌కి కూడా కేరైకాను నొక్కుతూనే వున్నాను. ఇంత లోతైన అనుబంధాన్ని డ‌బ్బుల‌కోసం తోసిరాజంటావా?! నీ రుణం తీర్చుకోడానికి వేరే మార్గ‌మే లేదా?

స‌రే, ఇంత‌గా అడుగుతున్నావ్ కాబ‌ట్టీ, ఇంకో ఐడియా చెపుతాను. ఇక‌నుండీ నేను ఏ పోస్టు పెట్టినా, దాని లింక్ కాపీ చేసి, నీ వాట్స‌ప్ స్టేట‌స్‌గా పెట్టాలి. నేను న‌డుపుతున్న "అఘోరాల‌కి ఉంగ‌రం - నిగారింపుకి బొంగ‌రం" అనే గ్రూపులో క‌నీసం నూట‌ప‌దార్ల మందిని మెంబ‌ర్స్ గా జాయిన్ చేయాలి. ఏమంటావ్‌?

డ‌న్‌. అన్న‌ట్టు, నిగారింపు అంటే గుర్తొచ్చింది. వెనిగ‌ర్ లో ఎసిటిక్ ఆమ్లం వుంటుంది. అందుకే, కూర‌గాయ‌లు ఫ్రిజ్జులో పెట్టుకునే ముందు మూడు వంతుల నీళ్ల‌లో ఒక వంతు వెనిగ‌ర్ వేసి, ఆ ద్రావ‌ణంతో క‌డిగి, శుభ్రంగా తుడిచి పెట్టుకుంటే బాక్టీరియా ద‌రిచేర‌కుండా వుంటుంది. స‌రేనా భ‌ర‌త్‌?

అలాగే ఏదో ఒక దానితో తుడిచి, ఎక్క‌డో ఒక చోట పెట్టుకుంటాలే గానీ, నువ్వు బ‌య‌ల్దేరు.
(స‌శేషం)

Discussion (0)