Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

My experiments with truth

Sridhar Bollepalli

టైటిల్ చూసి యిది గాంధీగారి ఆత్మ‌క‌థకి సంబంధించిన వ్య‌వ‌హారం అనుకొని... గాంధీగారి అభిమానులంతా ఆ బొక్క‌లే అని చూడ‌కుండా వ‌దిలేస్తార‌నీ, గాంధీగారి వ్య‌తిరేకులంతా బొక్క‌లు వెత‌క‌డానికైనా స‌రే ఆస‌క్తిగా చ‌దువుతార‌నీ నాకు భ‌యం లేకపోలేదు. కానీ, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ అనేదొకటుంటుందిగా.

టింగణం ప‌గిలితే గానీ భృంగ‌ణం బోధ‌ప‌డ‌దు అనే స్కూలునుండీ వ‌చ్చిన‌వాడిగా... నాకు రెండు ర‌కాల జాఢ్యాలున్నాయి. ఒక‌టి, అప్ర‌ధాన‌మైన విష‌యాల్లో నిజాన్ని తెలుసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడ‌డం. రెండు, ఆ నిజం కూడా స్వానుభ‌వం ద్వారానే గ్ర‌హించాల‌నే పంతం వుండ‌డం. అందులో భాగంగా ఏం జ‌రిగిందంటే...
నేను ఎలిమెంట్రీ స్కూల్లో పంతులుగా వున్న‌ప్పుడు.. స్కూలునుండీ ఇంటికొస్తుంటే వ‌ర్షం మొద‌లైంది. నాకెప్ప‌టినుండో కోరిక‌, వ‌ర్షంలో త‌డుస్తూ స్నానం చేయాల‌ని. గ‌బ‌గ‌బా యింటికొచ్చి ట‌వ‌ల్ క‌ట్టుకొని (అబ్బా.. ప్యాంటూ ష‌ర్టూ తీసేశాకేలేండీ).. స‌బ్బుబిళ్ల అట్టుకొని యింటెన‌క్కి పోయా. ఆర్గానిక్ ష‌వ‌ర్ బాత్ అన్న‌మాట‌. రుద్దుకోవ‌డం వ‌ర‌కే మ‌న ప‌ని, త‌ర్వాత మేట‌ర్ నేచ‌ర్ చూస్కుంట‌ది. వ‌ర్షం వొక రేంజిలో ప‌డ‌తంది. నిజానికి ఆ అనుభూతి నేను వూహించుకున్నంత ఆహ్లాదంగా లేదు. వాన‌చినుకులు కంక‌ర‌రాళ్ల‌లాగా చురుక్కుచురుక్కుమ‌ని త‌గులుతున్నాయి వొంటికి. క‌ట్ చేస్తే.. ట‌వ‌ల్ తో క‌వ‌ర్ చేసిన పార్టు (లేదా పార్టులు) మిన‌హాయిస్తే.. మిగిలిన దేహమంతా ఎర్ర‌బ‌డిపోయి వొహ‌టే సురుకుయునూ, పోటుయునూ. ఆ యిరిటేష‌న్ త‌గ్గ‌డానికి రెండ్రోజులు ప‌ట్టింది. అయితేనేం.. త‌త్వం బోధ‌ప‌డింది. వ‌ర్షంలో స్నానం చేయ‌రాదు. అది కూడా వేస‌వికాల‌ములో వ‌చ్చు క‌న్వెన్ష‌న‌ల్ రెయిన్ ఈజ్ నాట్ ఐడియ‌ల్ ఫ‌ర్ టేకింగ్ యువ‌ర్ ప‌బ్లిక్ బాత్స్..!

రెండు.. అర్జంటుగా సినిమాకి పోవాలి. మ‌న క్ర‌ష్షు కూడా వ‌చ్చుచున్న‌ద‌ని స‌మాచార‌ము క‌ల‌దు. త‌ల‌స్నానం చేసి, సాంబ్రాణి వేశాను. కానీ, స‌మ‌యానికి క‌రెంటు పోవ‌డంతో ఫ్యాన్ లేక‌ నా దుబ్బుజుట్టు ఎంత‌కీ ఆర‌దాయెను. ( పాస్ట్ దుబ్బులు కుడ్ బిక‌మ్ బాల్డ్స్). ఇహ లాభం లేద‌ని, గ్యాస్ స్టవ్ వెలిగించి, ఫ్లేమ్ హై లో పెట్టి, శిరోజ రాజ‌రాజ‌రాజాలకి కాస్త‌ సెగ త‌గిలించాను. ఆహా ఏమి తెలివిరా బాబుగా. యాడుండాల్సినోడివి యాడుండిపోనావు! నువ్వే ఆఫ్రికాలో పుట్టుంటే న‌ల్ల‌వాళ్ల‌మ‌ధ్య‌లో తెల్ల‌దొర‌బాబులా వెలిగిపోయి వుండెడివాడివి కావా..! ఇలాంటి ఆలోచ‌న‌ల్లో వున్న న‌న్ను ఘాటెక్కిన గంధ‌క‌ధూమం ఏదో యీ ప్ర‌పంచంలోకి లాక్కొచ్చింది. అది ధూమమే, కానీ గంధ‌కానికి కాదు. దేనిదో మీకు ప్ర‌త్యేకించి వివ‌రించ‌న‌వ‌స‌ర‌ము లేదు. లెస‌న్ లెర్న్ట్.. జుట్టు ఆర‌బెట్టుకోడానికి బ్యూటేన్ వాయువుని వినియోగించుట త‌గ‌దు.

దీజార్ జ‌స్ట్ టు ఫ్ర‌మ్ ద కాల‌నాళిక‌. సో మ‌చ్ మోర్ టు క‌మ్‌. చూస్తూనే వుండండి.. నిరంత‌ర స‌త్య‌శోధనా స్ర‌వంతి...

Discussion (0)