Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for IF IT WERE...

IF IT WERE...

Sridhar Bollepalli

విగ‌త‌జీవులకీ స్వ‌గ‌తాలుండొచ్చ‌ని
త‌లారికి తెలీక‌పోవ‌చ్చు
చివ‌రిశ్వాస రాసిన వీలునామాని
గాలి కూడా గ‌మ‌నించ‌క‌పోయుండొచ్చు

ప‌గిలిన అద్దం ముక్క‌ల్లోనుంచీ
ఒక్కో అవ‌య‌వాన్నీ ఏరి
నిన్ను నీకు అప్ప‌జెప్పిన
నిన్న‌ రాత్రిటి క‌ల‌ని

గుర్తుచేసుకునే అక్కర
నీకు లేకపోయినప్పుడు
త‌ప్పు త‌లారిదెలా అవుతుందిలే

మౌన సరస్సున దాగిన హిమశంఖాలని మోహించకుండా తమాయించుకోవాల్సింది
వ‌ధ్యశిల‌ని వ‌రించ‌క‌ముందే అంత‌రంగాన్ని అనువ‌దించాల్సింది
(Pic:Jaroslav Panuska)

Discussion (0)