Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

Deleted Happy New Year

Sridhar Bollepalli

నిన్న సాయంత్రం బడి వదిలిపెట్టాక ఇంటికొచ్చేద్దామని బయల్దేరుతుంటే.. ఒక పిల్ల బండికి అడ్డంపడినవ్వుతూ, షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నట్టు చెయ్యి ముందుకు చాపింది.

అంతవరకూ బాగానేవుంది. కానీ ఆ పిల్లనోటివెంట "Deleted Happy New Year Sir" అనే మాటలు వినగానే నా ఆనందం ఆవిరైపోయింది. కరచాలనం కోసం గాల్లోకి లేచిన నా చేయి షాక్ కొట్టినట్టు సగంలో ఆగిపోయింది. Belated అనడానికి బదులుగా Deleted అంటోందన్నమాట ఆవిడగారు.

"నిన్ను కాదే, నీకు ఇంగ్లిష్ నేర్పినోణ్ణి అనాలి" అని గొణుక్కుంటూ, హడావుడిగా ఇంటిదారి పట్టాను. హడావుడెందుకంటారా? ఆవిడగారికి ఆంగ్లం నేర్పుతున్న అప్రాచ్యుణ్ణి నేనే మరి. అద్దంలో చూసుకుంటూ, బూతులు తిట్టుకోవొద్దూ..!!

Discussion (0)