Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

వెంగళ్రావు నా కజిన్సును నోరారా గుర్తు చేసుకున్న ఆరోజు..

Sridhar Bollepalli

వెంగ‌ళ‌రావ్ః మాస్టారూ, మా చంటాడికి డ్రాయ‌ర్లు కొనాలి. విలాన్ బెట‌రా, ఆక్సో బెట‌రా?
నేనుః ఒక‌దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ‌, మ‌రోదానికి డ్యూర‌బిలిటీ ఎక్కువ‌. ఎదిగేవ‌య‌సు కాబ‌ట్టీ ఈ రెండిట్లో ఫ‌లానాది అయితే బెట‌ర‌నిపిస్తుంది నాకు.
వెంగ‌ళ‌రావ్ః అద్భుతంగా చెప్పారు సార్‌. అందుకే మీరంటే నాకు న‌మ్మ‌కం.
నేనుః థేంక్యూ


వెంగ‌ళ‌రావ్ః మాస్టారూ, మా బుడ్డ‌దాన్ని కొత్త‌బ‌ళ్లో వేయాలి. సీబీఎస్యీ బెట‌రా? ఐసీయ‌స్సీ బెట‌రా?
నేనుః అదైతే అదిరిపోద్ది. ఇదైతే బెదిరిపోద్ది. అందుకే, ఫ‌లానాది అయితే బెట‌రనిపిస్తుంది నాకు
వెంగ‌ళ‌రావ్ః అద్భుతంగా చెప్పారు సార్‌. అందుకే మీరంటే నాకు గౌర‌వం.
నేనుః థేంక్యూ వెంగ‌ళ‌రావ్‌గారూ. మై ప్లెజ‌ర్‌.


వెంగ‌ళ‌రావ్ః మాస్టారూ, మా ఆవిడ‌ని స‌ర్‌ప్ర‌యిజ్ చేయ‌డానికొక‌ చీర కొనాలి. జార్జెట్ అయితే బెట‌రా? క‌్రేప్ అయితే బెట‌రా?
నేనుః జార్జెట్ అయితే జారిపోకుండా వుంటుంది. క్రేప్ అయితే న‌లిగిపోకుండా వుంటుంది. ఫ‌లానాది అయితే బెట‌రేమో.
వెంగ‌ళ‌రావ్ః అద్భుతంగా చెప్పారు సార్‌. అందుకే మీరంటే నాకు అది.
నేనుః థేంక్యూ వెంగ‌ళ‌రావ్ గారూ. ద‌ట్స్ మై డ్యూటీ.


వెంగ‌ళ‌రావ్ః మాస్టారూ, మా బామ్మ‌ర్దికి రెండు ఆఫ‌ర్లు వ‌చ్చాయండీ. టీసీయ‌స్ బెట‌రా? ఐబీయ‌మ్ బెట‌రా?
నేనుః అందులో బెంచ్ లిమిటెడ్ గా వుంటుంది. ఇందులో బ్రంచ్ అన్ లిమిటెడ్ గా వుంటుంది. ఫ‌‌లానాది అయితే బెట‌ర‌నిపిస్తుంది నాకు.
వెంగ‌ళ‌రావ్ః అద్భుతంగా చెప్పారు సార్‌. అందుకే మీరంటే నాకు ఇది.
నేనుః థేంక్యూ వెంగ‌ళ‌రావ్ గారూ. యువార్ వెల్క‌మ్‌.


వెంగ‌ళ‌రావ్ః మాస్టారూ, వొక కారు కొనుక్కోవాల్సార్‌. శాంత్రో బెట‌రా, వాగ‌నార్ బెట‌రా?
నేనుః దీనికి లెగ్ రూమ్ స‌ఫిషియెంట్‌గా వుంటుంది. దానికి గ్రౌండ్ క్లియ‌రెన్స్ ఎఫిషియంట్ గా వుంటుంది. నా దృష్టిలో ఫ‌లానాదే బెట‌ర్‌.
వెంగ‌ళ‌రావ్ః అద్భుతంగా చెప్పారు సార్‌. అందుకే మీరంటే ఏదో తెలీని వొక‌లాంటిది.
నేనుః థేంక్యూ వెంగ‌ళ‌రావ్ గారూ. ఐ టూ ఫీల్ ద సేమ్‌.


నేనుః వెంగ‌ళ‌రావ్ గారూ, నిన్న ఫ‌లానా పార్టీ నాయ‌కుడు అలా అన్నాడేమిటండీ. కాస్త అనుచితంగా లేదూ.
వెంగ‌ళ‌రావ్ః ఎందుకుంట‌ది.. అహ‌, ఎందుకుంట‌దీ అంట‌.
నేనుః అది కాదు వెంగ‌ళ‌రావ్ గారూ..
వెంగ‌ళ‌రావ్ః ఏది కాదురా. ఏది కాదు! నీ టింగ‌ణం ఏషాలు నా ద‌గ్గ‌ర కాదు. మా కుల‌పోడంటే పెతోడికీ లోకువైపోయింది.
నేనుః వెంగ‌ళ‌రావ్ గారూ, అస‌లు మీరేం మాట్లాడు....
వెంగ‌ళ‌రావ్ః నీతో నాకు మాట‌లేందిరా. నీ మ‌ద‌రూ, నీ ఫాద‌రూ, నీ గ్రాండ్ మదరూ, గ్రాండ్ ఫాదరూ....
నేనుః వెంగ‌ళ‌రావ్ గారూ. దిసీజ్‌
వెంగ‌ళ‌రావ్ః ఏందిరా దిస్సూ ద‌ట్టూ.. నీ క‌జిన్సూ, నీ...
నేనుః 🏃🏃🏃🏃🏃🏃

Discussion (0)