సుమారు వొక పదేళ్లక్రితం మా ఫ్రెండుగాడొకడు అయ్యప్పమాల వేసుకున్నాడు. (ప్యూర్లీ హిజ్ ఓన్ బిజినెస్ అండ్ వియ్ బోత్ ఆర్ సెన్సిబుల్ ఎనఫ్ టు మైండ్ అవర్ వోన్ రెస్పెక్టివ్ బిజినెసెస్..) అతగాడితో కలిసి తిరుగుతూ వున్నప్పుడు నాకు కొందరు స్వాముల్ని సన్నిహితంగా చూసే అవకాశం లభించింది. వీళ్లలో సగంమంది మాల వేసుకున్నాక నిజంగానే కాస్త సాత్వికమైన ప్రవర్తనలోకి కన్వర్ట్ అవుతారు. కొంతమంది మాత్రం మొదటి రెండుమూడ్రోజుల తర్వాత పాత అలవాట్లనీ, పరుషమైన మాటల్నీ మిస్ అవుతూవుంటారు. అలాగని ఏదిపడితే అది మాట్లాడే అవకాశం వుండదు కదా..! అందరూ గమనిస్తూ వుంటారు. అయ్యప్పలూ యిలా చేయొచ్చా అని క్వశ్చన్ చేస్తారు. అందుకే, ఈ ఎక్సెప్షనల్ గ్రూప్ ఆఫ్ వియర్డ్ స్వాములు వుభయతారకంగా వొక విచిత్రమైన సంస్కృతికి తెరతీశారు. వారు మాట్లాడే మాటలేంటో కింద రాస్తాను. వారి మనసులో ఏముందో, అది ఏ రూపంలో బయటికొచ్చిందో మీరే ఆలోచించుకోండి..
"ఏంది స్వామీ నువ్వు చూసేది నా స్వామిశరణం"
"ఛా, అవునా..! స్వామిశరణమేం కాదూ.."
"ఆ స్వామి అన్నీ స్వామిశరణం పనులే చేస్తాడు"
"అబ్బో ఆ మాతా? ఆవిడ కొంచెం స్వామిశరణం టైపు"
"నీ స్వామిశరణంలో నా స్వామిశరణం"
ఎందుకొచ్చిన వుక్కుష్టంరా నాయనా? ఆ మాలలేవో నిజంగా దేవుడంటే భయమూ, భక్తీ వున్నవాళ్లకి వదిలేసి మీ మానాన మీరు సివిల్ బతుకులు బతకొచ్చుగా. ( సివిల్ బతుకులు అనగానేమి? ఇవి మెకానికల్, ఎలెక్ట్రానిక్స్ బతుకులకు ఏ విదంగా భిన్నము? అని ప్రశ్నించువారలు వుందురనియే నా విశ్వాసము. మాల వేసుకొననివారిని సివిల్ స్వాములుగా వ్యవహరించుట కద్దు)
Discussion (0)