Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for మా చిక్కూగాడు గీసిన అనేకానేక క‌ళాఖండాల్లో  యిదొక‌టి.

మా చిక్కూగాడు గీసిన అనేకానేక క‌ళాఖండాల్లో యిదొక‌టి.

Sridhar Bollepalli

ఆధునిక మాన‌వ జీవిత సంక్లిష్ట‌త‌లని ప్ర‌తిబింబించ‌డం ఈ పేయింటింగ్ ప్ర‌ధాన‌వుద్దేశం అని ఎవ‌రికైనా అర్థం అవుతుంది. కానీ, దీని ప‌రిధి అంత‌వ‌ర‌కేనా అని లోతుగా ఆలోచించిన మీద‌ట కొన్ని దిగ్భ్రాంతిక‌ర‌మైన కోణాలు వెలుగుచూశాయ‌ని చెప్ప‌డానికి నాకు కించిత్ గ‌ర్వంగా వున్న వాస్త‌వాన్ని మీరు గ‌ర్హించ‌ర‌ని నా ధైర్యం.
Art

  1. కాన్వాసుమీద ఈశాన్యం వైపున ఎక్కువ ఖాళీ ప్ర‌దేశం వుండ‌డం మ‌న‌కి క‌న‌బ‌డుతుంది. నిజానికి ఇండియా మ్యాపులో యిరుకుగా వుండి, ఎక్కువ విస్తీర్ణంలో క‌నిపించేదే ఈశాన్య‌ప్రాంతం. కానీ, ఆ భాగాన్ని ఖాళీగా వదిలేయడం ద్వారా చిక్కూ మ‌న‌కి ఏం చెప్ప‌ద‌ల్చుకున్నాడు? ఈశాన్య భార‌ద్దేశం వునికిని గుర్తించ‌ని, వారి ఆచార‌సంప్ర‌దాయాల‌ని గౌర‌వించ‌ని మ‌న డొల్ల‌త‌నాన్ని ఎత్తిచూపిస్తున్నాడు.

  2. ఇక ఆగ్నేయం వైపు దృష్టి సారిస్తే.. అక్క‌డ కొన్ని గీత‌లు కాన్వాసుని దాటి చొచ్చుకుపోయి వుండ‌డం చూస్తాం మ‌నం. ఇది ఒక దార్శ‌నికుడి క‌ల‌. ఆగ్నేయాసియా దేశాల‌కి త‌ల‌లో నాలుక‌లా మెలుగుతూ, పెద్ద‌న్న పాత్ర పోషించాల్సిన అవ‌స‌రాన్ని మ‌న‌దేశం గుర్తించ‌క‌పోవ‌డం ప‌ట్ల క‌ల‌త‌జెందిన క‌ళాకారుడి ఆశ‌కి అద్దం ప‌డుతుంది యిది.

  3. ప‌శ్చిమాన చూస్తే.. గుజ‌రాతీల ఆధిప‌త్యం పెరిగిపోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న కానొస్తుంది. అలాగే బోసిపోయిన తూర్పుని చూస్తే బంగాళాఖాతాన్ని వొక సాంస్కృతిక వార‌ధిగా వుప‌యోగించుకోవ‌డంలో మ‌న వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌న‌పిస్తుంది.

ఇదంతా కేవ‌లం రాజ‌కీయ కోణం మాత్ర‌మే. పేయింటింగ్ మొత్తం పూర్త‌య్యాక‌.. దానిమీద ఖాళీబ్ర‌ష్షుతో ప్ల‌స్‌, ఇంటూ అనే గ‌ణిత చిహ్నాల‌ని వొక‌దానిమీదొక‌టి సూప‌రింపోజ్ చేసిన విష‌యం మీ దృష్టిప‌థాన్ని దాటివుండ‌దు. ఏమిటి దీని ప‌ర‌మార్థం?

సామాజిక య‌వ‌నిక‌పై అమూర్త‌మైన అస్ప‌ష్ట‌త‌ని రుద్దుతున్న కాలిక్యులేష‌న్స్.. అంటే, కేవ‌లం వ్యాపార ప్ర‌యోజ‌నాల కోసం మాన‌వ సంబంధాల‌ని ప‌ణంగా పెట్ట‌డం వ‌ల్ల జ‌రిగే అన‌ర్థాల గురించి చిక్కూ మ‌న‌ల్ని హెచ్చ‌రిస్తున్నాడు. ఇహ‌పోతే,

bonism (the doctrine that the world is good but not perfect) అవ‌స‌రాన్ని గుర్తిస్తూనే, దానికి మితిమీరిన ప్రాధాన్య‌త యివ్వొద్ద‌ని మంద‌లించ‌డం,
empiricism (doctrine that the experience of the senses is the only source of knowledge) బోధిస్తున్న యింద్రియ సంబంధ జ్ఞానం తాలూకూ మాయలో ప‌డి, అనూచానంగా వ‌స్తున్న ఆచారాల‌ని తుంగ‌లో తొక్క‌డం పొర‌పాటు కాగ‌ల‌ద‌ని తొక్కిచెప్ప‌డం... కూడా యిక్క‌డ మ‌నం గ‌మ‌నించొచ్చు.

Discussion (1)

Collapse
Sloan, the sloth mascot
Comment deleted