Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

ఆ నలుగురూ... 😇😎😆

Sridhar Bollepalli

బ్రహ్మదేవుడు తన రైటింగ్స్ అన్నీ డిజిటల్ ఫైల్సుగా మార్చి, కొత్తగా కొనుక్కున్న ఐపాడులో వాటిని నిక్షిప్తం చేశాడు. జాగ్రత్త కోసం ఒక సెక్యూరిటీ కోడ్ (పాస్ వర్డ్) పెట్టుకోమని అది సజెస్ట్ చేసింది. అదే సమయానికి మేడమ్ సరస్వతీదేవి ఎఫ్ఎమ్ రేడియోలో బాలసుబ్రహ్మణ్యం పాడిన భక్తిపాటలు వింటోంది. ఆ క్షణానికి తన చెవిలో పడిన "గంగాతరంగ రమణీయ జటాకలాపం" అనే మాటల్ని కోడ్ గా పెట్టేశాడు బ్రహ్మాజీ.

కోడ్ పెట్టిందగ్గర్నించీ ఆయనకి సుఖం లేకుండా పోయింది. అదెక్కడ మర్చిపోతానో, ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని ఒకటే టెన్షన్. ఎందుకైనా మంచిదని, తన ఫ్రెండు జీసస్ క్రైస్టుకి ఫోన్ చేసి, "జీక్రై జీక్రై, నా ఐపాడ్ కోడ్ గంగా...కలాపం. గుర్తు పెట్టుకొని, నేను అడిగినప్పుడు చెప్పు" అన్నాడు. క్వైట్ నాచురల్లీ, ఆ క్షణంనుండీ ఏసుక్రీస్తుకి కూడా ప్రశాంతత కరువయ్యింది.

క్రీస్తు బాగా ఆలోచించి, మిత్రత్రయంలో మూడో వాడైన అల్లాకి ఫోన్ చేసి ఆయనకి మేటరంతా చెప్పాడు. "అల్లా అల్లా, మన బ్రహ్మ్ చెప్పిన కోడ్ ఏంటంటే... ఏంటంటే... ఏంటంటే.. ఆఁ గుర్తొచ్చింది,
'రంగా భారంగా కమనీయ తూటావిలాపం'.. గుర్తుపెట్టుకుంటావుగా. హమ్మయ్యా ఇక నా బీపీ మాయమైపోద్ది" అంటూ నిట్టూర్చాడు.

ఆయన బీపీ మాయం అవలేదు. అల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన తన most reliable soulmate అయిన బుద్ధుడికి‌ విషయమంతా ఎరుకపరిచి, కోడ్ ఇలా చెప్పాడు.. "ఉంగాఉంగా ఘోరంగా దయనీయ బాటాకోలాటం". బుద్ధుడికి బుర్రకాయ్ తిరిగిపోయింది. బ్రహ్మాజీ ఇలాంటి‌తలాతోకా లేని కోడ్ ఎందుకుపెట్టాడో అర్థంకాలేదు. స్మార్ట్ ఫోన్ల యుగం మొదలయ్యాక యూట్యూబులో వెస్టర్న్ గాలాగాలా వింటూ ఊపర్ వాలాలు అందరూ ఇలాగే బిహేవ్ చేస్తున్నారని తన కజిన్ "జాన్ రెడ్డీఖాన్" అన్నమాటలు గుర్తొచ్చినయ్.

కొన్నాళ్ల తర్వాత బ్రహ్మాజీకి కోడ్ అవసరపడింది. నలుగురూ కలిసి నానాతంటాలూ పడినా కోడ్ గుర్తుకి రాలేదు. డివైన్ ఇంటర్వెన్షన్ లేక భూలోకంలో అరాచకం ప్రబలిపోయింది. ఆ ఛండాలం కంట్రోల్ చేయడానికి స్వయంగా క్రీస్తు, అల్లా, బుద్దుడు భూలోకంలో మనుషులుగా పుట్టారు. మదర్ థెరేసా, మండేలా, మహాత్మాగాంధీ... అండ్ సో ఆన్. బ్రహ్మదేవుడింకా టూమచ్ ఆప్టిమిజమ్ తో ఆలోచిస్తానే వున్నాడు కోడ్ గుర్తుకురాకపోతుందా అని.

సూక్తి: నోరుమారితే మాట మారిపోతుంది. దేవుళ్లకే తప్పలేదు. పిపీలికముండావాళ్లం మనమెంత? ఎవడే సోది చెపితే అది నమ్ముద్దు. మెదడు అనే ఆర్గాన్ అప్పుడప్పుడూ అయినా వాడాలి.

Discussion (0)