Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

మీకు తెలుసో లేదో...

Sridhar Bollepalli

మీకు తెలుసో లేదో...

ఒక‌సారి రాంబాబుతోట‌, నేనూ క‌లిసి మాకిష్ట‌మైన టాపిక్ "ఆడ‌వాళ్ల‌ని తొక్కేయ‌డం ఎలా" అనేదాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంత‌లోకి ద‌గ్గుమాటి ప‌ద్మాక‌ర్ గారు ఫోన్ చేసి తాను రాసిన "నెల్లూరులో ఏముందిరా తొక్కా, నెల్లూరోణ్ని న‌మ్మితే ప‌డుద్ది బొక్కా" అనే క‌విత‌కి జిల్లాస్థాయిలో అంత‌ర్జాతీయ అవార్డు వ‌చ్చింద‌ని చెప్పారు. మేమిద్ద‌రం త‌ప్ప‌కుండా రావాల‌ని కూడా చెప్పారు. నాకు ఏ స‌మ‌స్యా లేదు గానీ ఆరోజు రాంబాబుకి వేరే ప‌నుంది. "జ‌య‌ము జ‌య‌ము జ‌గ‌న‌న్నా.. జ‌య‌ము నీకు జ‌గ‌న‌న్నా" అంటూ రామ్‌క‌ర‌ణం గారు రాసిన పాట‌కి అంత‌ర్జాతీయ స్థాయిలో జిల్లా అవార్డు వ‌చ్చింది. ఆ ఫంక్ష‌న్‌కి పోవ‌డం రాంబాబుకి త‌ప్ప‌నిస‌రి. దేనికి పోయినా క‌లిసి పోవాల‌ని గ‌దా అనుకుని చ‌చ్చాం.

ఇంకో రెండు పెగ్గులు బిగిస్తే గానీ క‌ర్త‌వ్యం బోధ ప‌డేలా లేదు. వోడ్కా తాగుదామ‌ని నేను ముచ్చ‌ట‌ప‌డ్డాను గానీ.. "ఆరోగ్యానికి హానిక‌రంరా వోడ్కా, తాగావంటే తోలుతీస్తా నా కొడ్కా" అని ఆర్జీవీ రాసి స్వ‌యంగా పాడిన పాట గుర్తు రావ‌డంతో స‌య‌మ‌నం పాటించ‌క త‌ప్పింది కాదు. మేట‌ర్ ఇలా తేలేది కాద‌ని న‌రేష్ నున్నా గారికి కాల్ చేసి స‌ల‌హా అడిగాం.. "భ్రాతా, మా మాన‌స ర‌త్నాక‌ర‌ముల‌ను క‌ల్లోలభ‌రితం చేయుచున్న ఈ ధ‌ర్మ సంక‌ట‌మునుండీ మ‌మ్ముల‌ను బ‌య‌ట ప‌డ‌వేసి మాకు ముద‌ము చేకూర్చుమా" అని. మా భాష వింటూనే న‌రేష్ నున్నా గారు ఆగ్ర‌హోద‌గ్రులైపోయారు. "తేట‌ప‌దాల తేనెలూరే ఊట‌బావి లాంటి సింపుల్ తెలుగు వ‌దిలేసి, ఆ గ్రాంథికంలో ఎందుకు మాట్లాడ‌తారూ" అని తిట్టిపోశారు. సాంతం విన‌కుండా ఫోన్ పెట్టేశాం.

చిన్నీ అజ‌య్ ని అడుగుదాం అనుకున్నాం. కానీ, అత‌గాడు అందుబాటులో లేడు. "ఆడోళ్లంతా అక్క‌లే, కుక్క‌లు పీకాల‌నుకునేది పిక్క‌లే" అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావ‌డానికి శ్రీకాకుళం నుండీ చిత్తూరు వ‌ర‌కూ ఆసేతుహిమాచ‌ల యాత్ర చేస్తున్న కార‌ణంగా ఫోన్లు కూడా అటెండ్ అవ్వ‌ట్లేద‌ని చెప్పాడొక కార్య‌క‌ర్త‌. ఇప్పుడేవిటీ చేయ‌డం?! అంత‌ర్జాతీయ స్థాయిలో వ‌చ్చిన జిల్లా అవార్డు గొప్ప‌దా? జిల్లా స్థాయిలో వ‌చ్చిన అంత‌ర్జాతీయ అవార్డు గొప్ప‌దా? రాంబాబు కోరికని మ‌న్నించి నేను రామ్ క‌ర‌ణం స‌భ‌కి పోతే ఆరెస్సెస్ దండ‌కార‌ణ్య సంఘ్ చాల‌క్ అయిన అరుణాంక్ ల‌త వూరుకుంటాడా? అలాగ‌ని, నా ఇష్టం మేర‌కి ప‌ద్మాక‌ర్ స‌భ‌కి పోతే ఆగ్నేయాసియా మావోయిస్టు పార్టీల సంధాన‌క‌ర్త అయిన ఎపీవీ ప్ర‌సాద్ గారితో మాట రాదూ?!

ఇంత చిన్న విష‌యానికే త‌ల‌లు బ‌ద్ధ‌లు కొట్టేసుకుంటున్నాం క‌దా? ఇంకా పెద్ద పెద్ద విష‌యాల్లో పేద్ద‌వాళ్ల‌కి ఎన్ని ఇష్యూసొస్తాయో క‌దా? చైనాలో లిన్ పియావో వ‌ర్గం ప‌రాజ‌యం పాల‌వ్వ‌డ‌మే ద‌క్షిణ‌భార‌తంలో హ‌రిత‌విప్ల‌వం ఫెయిల‌వ్వ‌డానికి కార‌ణం అనే థియ‌రీని సీపీఎం పాలిట్‌బ్యూరో ఎజెండాలో పెట్ట‌డానికి న‌రేంద్ర‌మోడీ ఎన్ని తిప్ప‌లు ప‌డుంటాడు! స‌తీమాల్కోవా సినిమా తీసి, దానిని థియేట‌ర్లో కాకుండా పోర్నుహ‌బ్‌ డాట్ కామ్ లో రిలీజ్ చేయ‌డానికి విశ్వ‌నాథ్ ఎన్ని బాధ‌లు ప‌డుంటాడు? ఇవ‌న్నీ గుర్తు రాగానే నా క‌డుపు చెరువైపోయింది. చెక్కిళ్లు క‌న్నీటితో త‌డిసిపోయాయ్‌. "ముద‌న‌ష్ట‌పెద‌వా, ముప్పొద్దులా తిని తొంగోడ‌మే త‌ప్ప పైసా ఉప‌యోగం లేదు క‌దా నీవ‌ల్ల" అని మా కాంతం గ‌ద్దించ‌డంతో మెల‌కువొచ్చింది కానీ, లేకుంటేనా...!

Discussion (0)