Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

పుప్పుప్పుప్పు పులిహోర

Sridhar Bollepalli

ఆమె:

"పిట రెట వెయూను" అని నేను రాసిన ఏక‌వాక్య క‌వితపై మంచి రివ్యూ రాసిన‌వాళ్ల‌కి నా వాట్స‌ప్ నంబ‌ర్ యిస్తాను.


అత‌ను:

క్లేంచిక గారు రాసిన ఏక‌వాక్య క‌విత చ‌దివాను యిప్పుడే. మ‌న‌సంతా అదోలాంటి అనుభూతితో నిండిపోయింది. పిట్ట‌ అని రాయాల్సినచోట పిట అని రాసి స‌రిపెట్ట‌డంలో క‌వ‌యిత్రి ఆలోచ‌న‌ల్లో క్లుప్తత, గాఢత అర్థ‌మ‌వుతున్నాయి. ఈ లోక‌పు భౌతిక‌ సంక్లిష్ట‌త‌ల‌నుండీ బ‌య‌ట‌ప‌డి, మ‌న‌సుకి వొక తేలిక‌పాటిత‌నాన్ని అల‌వాటు చేయాల్సిన అవ‌స‌రాన్ని యీ ప్ర‌యోగం మ‌నంద‌రికీ గుర్తుచేస్తోంది.

ఇక‌పోతే రెట‌. ఈ క‌విత‌కంత‌టికీ కీల‌క‌మైన ప‌దం యిదే. రెట్ట అనే ద్విత్వాక్ష‌రాన్ని వుద్దేశ‌పూర్వ‌కంగా రెట అనే స‌ర‌ళ‌ప‌దంగా మార్చ‌డం ఎందుకో పై పేరాలోని విశ్లేషణ‌బ‌ట్టి తెలుస్తోంది కాబ‌ట్టీ, మ‌ళ్లీ ఆ కోణాన్ని ప్ర‌స్తావించ‌ను. రెట్ట అంటే షిట్టు. పిట్ట షిట్టేయ‌డం అనేది వొక సామాన్య దృగ్విష‌యంగా మ‌నం కొట్టిపారేసే ప్ర‌మాదం వుంది. కానీ, రెట్ట దేనికి సింబలు అనేది ఆలోచించాలి యిక్క‌డ మ‌నం. ఇక్క‌డ‌నే కాదు, ఎక్క‌డైనా స‌రే, రెట్ట అనేది వొక ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాటు. Had there been the existence of constipation, we would not have written the constitution అని అమెరికా రాజ్యాంగనిర్మాత‌ల్లో వొక‌డైన వార్జి బాషింగ్ట‌న్ అనడం గ‌మ‌నార్హం. అఫ్ కోర్స్ యిది బ‌య‌లాజిక‌ల్ యాస్పెక్టు. కానీ, రెట్టేయ‌డం అనే వొక simple, uncomplicated, effortless, mechanical యాక్టుకి కాస్త తాత్విక‌చింత‌న‌ని జోడించి తీరాలి. బ‌రువు దించుకోవ‌డం.. అంటే స్వేచ్ఛాప్రియ‌త్వం. ఇంకా స్థూలంగా చెప్పాలంటే relative objectivity of the irrelevant subjectivity resulting in eccentric vulnerability coupled with pragmatic veracity అన్న‌మాట‌.

చివ‌రిగా మిగిలింది "వెయూను". క్లేంచిక‌గారి అభివ్య‌క్తిలో వున్న విల‌క్ష‌ణ‌‌త‌కి అద్దం ప‌ట్టే మాట యిది. వేయునూ అన‌కుండా వెయూను అన‌డంలోనే వుంది అందమంతా. అంతంలో హ్ర‌స్వం వ‌చ్చేలా మ‌ధ్య‌లో
అద‌న‌పు మాత్ర వేయడం క‌వయిత్రికి ఛంద‌స్సు మీద వున్న ప‌ట్టుని నిరూపిస్తోంది. పైగా, యీ అద‌న‌పు మాత్ర ఏ అక్ష‌రానికి ప‌డింది? యూ..!! యూ అంటే ఏమిటి? నువ్వు (YOU) !! నువ్వు మాత్ర‌మే ముఖ్యం. నువ్వు త‌ప్ప ఎవ‌రూ లేరు. ఉన్న‌ది వొక్క‌రే. ఇక్క‌డ మీకు అద్వైత సిద్ధాంతం స్ఫురణ‌కి వ‌చ్చి తీరుతుంది. ఆదిశంక‌రుడు చెప్పినా, Deontological Ethics అనే పేరుతో ఇమాన్యువ‌ల్ కాంట్ చెప్పినా సారాంశం అదే.

రాష్ట్రంలో విద్యార్థుల‌కు కొత్త‌గా పాఠ్య‌పుస్త‌కాలు రూపొందించ‌బ‌డుతున్న నేప‌ధ్యంలో "పిట రెట వెయూను" అనే ఏక‌వాక్య క‌విత‌ని ప్ర‌తి త‌ర‌గ‌తిలోనూ పెట్టాల్సిన అవ‌స‌రం వుంది. పిల్ల‌ల్లో క‌విత్వం ప‌ట్ల ఆసక్తినీ, అనుర‌క్తినీ రేకెత్తించ‌డ‌మే కాక‌, లాక్‌డౌన్ టైములో సిల‌బ‌స్ త్వ‌ర‌గా పూర్తి కావ‌డానికి కూడా దోహ‌ద‌కారి కాగ‌ల‌దు.


And, the best critique of the year award goes to ......

Discussion (0)