Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

సొంత‌బుర్ర‌లూ వాడొచ్చు.. త‌ప్పు లేదు

Sridhar Bollepalli

ఆరోత‌ర‌గ‌తి ఇంగ్లిషు టెక్స్ట్ బుక్ లో ఒక పాఠం వుంది. పీస్ అండ్ హార్మ‌నీ అనే పేరుతో..
ఒక అడ‌విలో అనేక జంతువులుంటాయి. అవ‌న్నీ చాలా స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో క‌లిసిమెలిసి వుంటాయి. పండ‌గ‌లూ ప‌బ్బాలూ క‌లిసే జ‌రుపుకుంటాయి. విందులూ వినోదాల్లో మునిగి తేలుతుంటాయి. ఒకదానితో వొక‌టి స‌ర‌సాలాడుకుంటూ వుంటాయి. కొత్త‌గా ఎక్క‌డినుండో వొక న‌క్క ఆ అడ‌వికి వ‌స్తుంది. అన్యోన్యంగా వుండే ఆ జంతువుల మ‌ధ్య త‌గాదాలు పెట్టి, అడ‌విలో ప్ర‌శాంత‌త‌ని భ‌గ్నం చేస్తుంది. చివ‌రికి జంతువుల‌న్నీవొక‌దానిప‌ట్ల వొక‌టి భ‌యం, అనుమానం, అప‌న‌మ్మ‌కం పెంచుకుంటాయి. ఇదంతా చూసిన చంద‌మామ వొక సాధువు రూపంలో వ‌చ్చి న‌క్క‌ని చంపి, మ‌ళ్లీ ఆ అడ‌వికి పూర్వ‌పు శోభ‌ని తెచ్చిపెడ‌తాడు. క్లుప్తంగా యిదీ ఆ పాఠం సారాంశం.

విన‌డానికి చాలా బావుంది. కానీ వొక్క డౌటు. న‌క్క రాక‌ముందు ఆ అడ‌విలో వున్న మాంసాహార జంతువులు ఏమి తినేవి? చిన్న‌చిన్న జంతువుల‌ని చంప‌కుండా, అవి బ‌త‌క‌డం ఎలా సాధ్య‌మైంది? ఆల్రెడీ కొన్ని జంతువులు త‌మ‌క‌న్నా బ‌ల‌హీన‌మైన జంతువుల‌ని చంప‌డం ద్వారా త‌ప్ప వేరేవిధంగా మ‌నుగ‌డ సాధించ‌లేని ప‌రిస్థితులు వున్న‌ప్పుడు.. యింకా ఆ అడ‌వి హింస‌కి తావులేని ఆద‌ర్శ‌ప్ర‌పంచం ఎలా అవుతుంది? న‌క్క‌ని విల‌న్ గా చూపడం కోసం, అడ‌విలో అస‌లెప్పుడూ వునికిలో లేని సౌభ్రాతృత్వం, వున్న‌ట్లుగా న‌మ్మించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు?

ఇదొక చిన్న వుదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఇంకో పాఠంలో, సిటీలో వుండే వొక‌త‌ను త‌న ఫ్రెండుకి లెట‌ర్ రాస్తాడు. ప‌ల్లెటూళ్లో జీవితం ఎంతో మ‌ధురంగా వుంటుందనీ, న‌గ‌రంలో ఛండాలంగా వుంటుందనీ చెపుతూ త‌న క‌ష్టాల‌న్నీ ఏక‌రువు పెడ‌తాడు. ప‌ల్లెటూళ్ల‌న్నీ స్వ‌ర్గ‌ధామాల‌నీ, మిగిలిన ప్ర‌పంచ‌మంతా న‌ర‌క‌ప్రాయ‌మ‌నీ చెప్పే ఆ పాఠం చాలా ర‌కాలుగా రాంగ్ మెసేజ్ పంపుతుంది. తన‌తోపాటు త‌న భార్య కూడా వుద్యోగం చేయ‌డం వ‌ల్ల, పిల్ల‌ల్ని పెంచ‌డం ఎంత క‌ష్ట‌మ‌వుతుందో కూడా చెప్తాడు ప‌నిలో ప‌నిగా. న‌గ‌రీక‌ర‌ణ‌తో పాటు అనివార్యంగా కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ వొక్క‌ట‌నే కాదు, మార్పు ఎప్పుడూ కొత్త స‌వాళ్ల‌ని వెంట‌బెట్టుకునే వ‌స్తుంది క‌దా!?

నేను చెప్ప‌ద‌ల్చుకుంది ఏంటంటే... పాఠ్య‌పుస్త‌కాల్లో వున్న భావ‌న‌ల‌ని క్వెశ్చ‌న్ చేయ‌డం త‌ప్ప‌నీ, అక్క‌డ వున్న‌దాన్ని వున్న‌ట్టు పిల్ల‌ల మ‌స్తిష్కాల్లోకి ఎక్కించాల‌నీ టీచ‌ర్లు అనుకోవ‌డం స‌రైంది కాదు. త‌మ విచ‌క్ష‌ణ‌ని వుప‌యోగించి, ఆయా అంశాల్ని చ‌ర్చ‌కి పెట్టొచ్చు. ఒక సినిమాలోనో, క‌థ‌లోనో వుండే పాత్ర‌ల స్వ‌భావాల్నీ, మంచిచెడుల్నీ చ‌ర్చించ‌డానికి ఎలాంటి స్వేచ్ఛ వుంటుందో.. త‌ర‌గ‌తి గ‌దిలో చెప్పే పాఠాల విష‌యంలో కూడా అలాంటి స్వేచ్ఛ అవ‌స‌రం అని అంద‌రూ గుర్తించాలి.

ఎవ‌రో న‌లుగురైదుగురు కూర్చొని రాసిన పాఠం... మ‌న మొద్దుతనం వ‌ల్ల సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి పిల్ల‌లబుర్ర‌ల్లోకి ప్ర‌వ‌హిస్తూ వుండ‌డం అవ‌స‌ర‌మా? నేను యిక్క‌డ వుద‌హ‌రించిన రెండు సంద‌ర్భాల్లోనో, లేదా అందులో వొక‌దాని విష‌యంలోనో నా అవ‌గాహ‌న త‌ప్పు అయ్యి వుండొచ్చు. కానీ, టెక్స్ట్ బుక్స్ లో వుండ‌కూడ‌నివి చాలానే వున్నాయి. కొత్తగా సిల‌బ‌స్ మార్చ‌దల్చుకున్న‌ప్పుడు.. ఆ పాఠాల్ని చ‌ర్చ‌కి పెట్ట‌కుండా, హ‌డావుడిగా ప్రింట్ చేసి, పంపిణీ చేసి, ఆ చారిత్రిక త‌ప్పిదాన్ని ఆన‌క తీరిగ్గా గుర్తించి, ఎప్పుడో వొక ద‌శాబ్దం త‌ర్వాత స‌రిచేసుకునే సంప్ర‌దాయం పోవాలి.

Discussion (1)

Collapse
John Doe

Asdf