Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for Mathematics Day 22nd december

Mathematics Day 22nd december

sivakiran

Best wishes for mathematics day....Alt Text
డిసెంబర్ 22 - మేథమెటిక్స్ డే------ శ్రీనివాస రామానుజన్‌ జయంతి.
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్‌కు నివాళి......... రామానుజన్ పుట్టిన రోజైన డిసెంబర్ 22ను ఏటా’ జాతీయ గణిత దినోత్సవం ‘గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.Alt Text
భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు శ్రీనివాసరామానుజన్‌ . తమిళనాడులో ' కోమలతామ్మాళ్‌, శ్రీనివాస అయ్యంగార్‌ 'దంపతులకు , ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో ,డిసెంబర్ 22వతేదీన 1887 వ సంవత్సరంలోజన్మించారు శ్రీనివాసరామానుజన్‌. విద్యార్థి దశ నుంచే గణితశాస్త్రం పట్ల అమితాసక్తి కలిగి ఎన్నో గణిత సిద్ధాంతాలను ఆవిష్కరించారు.Alt Text
చిన్నతనం నుంచే రామానుజన్ గణితం పట్ల అద్భుతమైన తెలివితేటల్ని ప్రదర్శించేవాడు .13ఏళ్లచిరుప్రాయం లోనే గణితశాస్త్రంలోని’ ట్రిగనోమెట్రీ (త్రికోణమితి) ‘అనే క్లిష్టమైన అంశంపై పట్టు సాధించాడు. లెక్కల పుస్తకాల్లోని అనేక సిద్ధాంతాల్ని రూపొందించారు. రామానుజన్ కఠినమైన లెక్కల్ని సునాయాసంగా చేసేవాడు, చదువులో పెద్దపెద్ద డిగ్రీలు లేకపోయినప్పటికీ గణితశాస్త్రంలో అసమాన ప్రతిభ కనబర్చిన మహనీయుడు శ్రీనివాస రామానుజన్. 15 ఏళ్ల వయసులో ఆయన చేసిన లెక్కల పుస్తకాలని ఈనాటికీ గణిత శాస్తవ్రేత్తలు అధ్యయనం చేస్త్తూనే ఉన్నారు.
రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు.తల్లి కోమలటమ్మాళ్ గృహిణి మరియు ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంబకోణం అనే పట్టణంలో, సారంగపాణి వీధిలో, దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్దతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. దాన్నిప్పుడు మ్యూజియం గా మార్చారు.. డిసెంబరు 1889 లో రామానుజన్ కు మశూచి (అమ్మవారు) వ్యాధి సోకింది. కానీ ఎలాగో బ్రతికి బయట పడగలిగాడు. తరువాత రామానుజన్ తల్లితోపాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు.
రామానుజన్ అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానం లోని ఉద్యోగం పోవడంతో రామానుజన్ తల్లితో సహా తిరిగి కుంబకోణం వచ్చి అక్కడ’ కంగయాన్ ప్రాథమిక పాఠశాల’లో చేరాడు. అతడిప్రాధమిక విద్య సరిగాఒకే చోట సాగలేదు, మద్రాసు, కుంభకోణం కాంచీపురం అలామారసాగింది.
రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడంవల్ల చిన్నపుడు అతని భాద్యతలు తల్లే చూసేది. కాబట్టి తల్లితో చాలాగాఢమైన అనుబంధం కలిగిఉండేవాడు. ఆమెనుంచి రామానుజన్ సాంప్రదాయాల గురించి, కుల వ్యవస్థ గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. భక్తిగీతాలు ఆలపించడం నేర్చు కున్నాడు. ఆలయాలలో పూజలకు తప్పక హాజరయ్యేవాడు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచు
కున్నాడు. ఒక మంచి బ్రాహ్మణబాలుడిగా ఉండాలంటే ఈలక్షణాలన్నీ తప్పనిసరి.కంగయాన్ పాఠశాల లో రామానుజన్ మంచి ప్రతిభావంతమైన విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నాడు.పదేళ్ళకే ఆంగ్లం,తమిళం , భూగోళ శాస్త్రం, గణితంలోనూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. పదేళ్ల వయస్సు నుంచే గణితంలో ప్రజ్ఞను ప్రదర్శించిన ఆయన.. గణితంలో కష్టసాధ్యమైన 'త్రికోణమితి' విభాగంపై పన్నెండేళ్ల వయస్సులోనే పూర్తిగా పట్టు సాధించారు. 17 ఏళ్ల వయస్సులోనే 'బెర్నౌలీసంఖ్యలు, యూలర్ అనంత సంఖ్యల సిద్ధాంతా'లపై పరిశోధనలు చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం కుంభకోణంలోని కళాశాలలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ఇచ్చింది.కానీ కేవలం గణితం తప్ప మిగతా గణితేతర సబ్జెక్టుల్లో ప్రతిభచూపకపోవడంతో ఆ తరువాత స్కాలర్‌షిప్‌ను నిలిపివేశారు.
1909, జులై 14వ తేదీన అంటే ఆయన 22వయేట రామానుజన్ కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహ మైంది.. తరువాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు.మద్రాస్ పోర్టుట్రస్టు కార్యాల యం లో గుమాస్తా గా చేరి, ఆ డబ్బుతో మరో కాలేజీలో చదువుతూ.. గణిత పరిశోధనలు చేశారు.
అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పని చేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగంకోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ ఆనోటుపుస్తకాలలోని అపార మైన గణిత విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.అంతటి గొప్ప విజ్ఞానికి ఈచిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇవ్వలేక,రామస్వామి రామానుజన్ ను కొన్నిపరిచయలేఖలురాసిమద్రాసులోతనకుతెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతనిపుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావుదగ్గరకు పంపించారు.ఈయనభారతీయగణితశాస్త్రసమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడారామానుజన్ పనితనం చూసిఅబ్బురపడి, అవిఅతని రచన లేనా అని సందేహం కూడావచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్
’ సల్ధానా’ గురించి, అతనిరచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పాడు.
నారాయణఅయ్యర్, రామచంద్రరావు, E.W.మిడిల్‌మాస్ట్ మొదలైనవారురామానుజన్ పరిశోధన లనుఆంగ్ల గణితశాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు.లండన్ యూనివర్సిటీకాలేజీకి చెందిన ఎం.జే.ఎం. హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనల్లో కొన్నిలోపాలున్నాయని వ్యాఖ్యానించాడు. హిల్ ,రామానుజన్ ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదుగానీ, రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చారు. ఆయన ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్‌ ప్రొఫెసర్‌ జి.హెచ్‌. హార్డీకి పంపారు.రామానుజన్‌మేధస్సుకుఆశ్చర్యపడినహార్డీఆయననుబ్రిటన్‌కుఆహ్వానించారు. అంతేకాక, 28-12-1918 న రామానుజన్‌ను 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'మెంబర్ గా ఎన్నుకున్నారు. దీంతో రాయల్‌ సొసైటీలో ఫెలోషిప్‌ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కేవలం 30 ఏళ్ళ వయస్సులోనే గణితంలో అనేకచిక్కుసమస్యలనుపరిష్కరించి,ఎన్నోకొత్తసిద్ధాంతాలనుఆవిష్కరించారు.
రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్దులైన ఆయిలర్, గాస్, జాకోబి మొదలైన సహజసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ ‘అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే !’అని వ్యాఖ్యానించడం విశేషం.1914లో రామానుజన్ ఇంగ్లండుకుప్రయాణమయ్యాడు.శాఖాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లండులో స్వయంపాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతర పరిశోధనల వల్ల కలిగిన శ్రమ వలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల చాలా తీవ్రమైన పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్థమైంది.తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని, అంకిత భావానికి నిదర్శనం. ఆకొద్ది కాలంలోనే రామానుజన్ దాదాపు 3200 ఈక్వేషన్స్‌ను, ఐడెంటీటీస్‌నుసాధించారు. 'రామానుజం ప్రైమ్, రామానుజంటీటా ఫంక్షన్'లను రూపొందించారు.. కొద్దిరోజులకే రాయల్ సొసైటీ, ట్రి నిటీ కళాశాల ఫెలోషిప్‌లను పొందారు
క్షయవ్యాధికి గురై ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు.బొద్దుగా,కొంచెంనల్లగా కనిపించే ఆయన ఇంగ్లండు నుంచి పాలిపోయిన అస్థిపంజరం వలే తిరిగి వచ్చిన రామానుజన్ ను చూసి ఆయన అభిమానులు చలించిపోయారు.అనేకరకాల వైద్యవసతులు కల్పించినా ఆయన కోలుకోలేక పోయారు.దాంతో ఆయన పిన్నవయస్సులోనే 1920,ఏప్రిల్26న పరమపదించారు. శుద్ధగణితంలో’ నంబర్ థియరీ ‘ లోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధ నల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగ పడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో’ మ్యాక్-తీటా ఫంక్షన్స్’ పైచేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండటం విశేషం.
..
రామానుజన్ చాలా సున్నితమైన భావాలు, మంచి పద్దతులు కలిగిన వాడు కాస్త బిడియస్తుడు. ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత ఆయన్ను శుద్ధసాంప్రదాయవాదిగా పేర్కొనడం జరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన’ నామగిరి’ ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టం కలిగినా ఆమె సహాయం కోసం ఎదురుచూసేవాడు. ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారంచూపించగలదని భావించేవాడు.
’ భగవంతునిచే ప్రాతినిథ్యం వహించబడని ఏ ఆలోచనా సూత్రం కానేరదు ‘అని అప్పుడప్పుడూ అనేవాడు. రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు.
రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడుప్రభుత్వం , ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22 ను ‘రాష్ట్ర సాంకేతిక దినోత్సవం’గా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొని యాడుతూ ‘స్మారక తపాలా బిళ్ళ’ను విడుదల చేసింది.
అంత మేధావి మరికొంతకాలం జీవించి ఉంటే గణితశాస్త్రంలో భారతదేశప్రతిభను ఇంకా దశదిశలా వ్యాపింపజేసేవాడే!ఈరోజున భారతీయులమంతాఆయనకునివాళులర్పించడంమన ధర్మంగా భావించాలి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో గణితపోటీలు నిర్వహించి,రామానుజన్ పేర బహుమతులు ఇచ్చి బాలలకంతా గణిత ప్రఙ్ఞాశాలి ఐన ఆయన గురించీ తెలియజెప్పడమూ మన బాధ్యతగా భావించాలి

Discussion (0)