Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

Discussion on: Happy Teacher's Day

Collapse
sivakiran

గురుపూజోత్సవం సందర్భంగా నేటి గురువు గురించి...

విలేఖరి: ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ ఉపాధ్యాయుడి గురించి నువ్వు ఏమి చెప్పగలవు?

విద్యార్థి: మా టీచర్ మాకు గుడ్లు ఇస్తారు. చిక్కీలు ఇస్తారు. పుస్తకాలు ఇస్తారు. నోట్ బుక్ లు ఇస్తారు. వేలిముద్ర వేయించుకుంటారు. బట్టలు ఇస్తారు. భోజనం పెట్టిస్తారు. మా మరుగుదొడ్లు కడిగిస్తారు. ఫోటోలు తీస్తారు. ఎప్పుడు ఫోన్లో ఏదో నొక్కుతుంటారు. మాకు మాస్క్ లు పెట్టుకోమని క్లాస్ పీకుతూ ఉంటారు. మా షూ సైజులు కొలుస్తూ ఉంటారు. మా మార్కులు ఆన్లైన్ లో పెడుతుంటారు. మా స్కూలులో నాడు నేడు పనులు చేయిస్తూ ఉంటారు. ఇంకా చాలా చేస్తారు సార్.

విలేఖరి: మరి చదువు చెప్పడం?

విద్యార్థి: అదా మరి ఏమో సార్.