Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

24 గంటల్లో ఫిర్యాదు చేస్తే.. డబ్బు రికవరీ!

sivakiran

☘️
Alt Text
24 గంటల్లో ఫిర్యాదు చేస్తే.. డబ్బు రికవరీ!

జాతీయ హెల్ప్ లైన్ నం.
155260

సైబర్ నేరాలపై పోలీసుల సూచన

సైబర్ నేరాల్లో మీరు డబ్బులు పొగొట్టుకున్నారా ?

అయితే 24 గంటల్లో జాతీయ హెల్ప్ లైన్ 155260తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్ పోర్టలు ఫిర్యాదు చేయాలి.

అలా చేస్తే పోగొట్టుకున్న సొమ్మును సైబర్ క్రైం ఖాతాల్లోకి బదిలీ కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో డబ్బు ఉన్నప్పుడు వెంటనే బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసి వాటిని ఫ్రీజ్ చేస్తారు. మోసం జరిగిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని సైబర్ క్రైం పోలీసులు పేర్కొంటు న్నారు.

అయితే ఈ ఫిర్యాదు నమోదు చేసే సమయంలో ఈ వివరాలు మీ వద్ద ఉండాలి.

ఫిర్యాదు నమోదుకు మీ దగ్గర ఉండాల్సినవి..

  1. ఫిర్యాదుదారుడి ఫోన్ నంబరు

  2. ఖాతా ఉన్న బ్యాంకు పేరు, వాలెట్ పేరు

3• బ్యాంక్ అకౌంట్ నంబరు, వాలెట్, మర్చంట్ ఐడీ, యూపీ ఐడీ నంబర్లు

  1. లావాదేవి జరిపిన ఐడీ, తేదీ, సమయం

  2. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిగితే వాటి నంబర్లు

6• మోసానికి సంబంధించిన లావాదేవీల స్క్రీన్ షాట్లను తీసిపెట్టుకోవాలి.

ఫిర్యాదు ఎక్కడ చేయాలి:

సైబర్ క్రైం జాతీయ హెల్ప్ లైన్ నంబరు-

155260
www.cybercrime.gov.in.

హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్...
040-27852412

సైబరాబాద్ సైబర్ సెల్ 040-27854031
040-27853418
9490617310
9490617100

ఈ-మెయిల్
acp-cbyercrimes-rck@tspolice.gov.in

రాచకొండ సైబర్ సెల్ 040-27854044
040-78609048.

Discussion (0)