Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

నిజమైన హైదరాబాదీ

sivakiran

అమెరికాలో ఉంటాడు మన హైదరాబాదీ ఒకాయన... సరే, కథ పఠనాసౌలభ్యం కోసం తన పేరు యాదగిరి అనుకుందాం... పన్ను నొప్పి భరించలేక ఓ డెంటిస్టు దగ్గరకు వెళ్లాడు...

ఎందుకైనా మంచిదని ముందే అడిగాడు, ఎంత తీసుకుంటారు అని...! నిజమైన హైదరాబాదీ ఎవరైనా అంతే కదా...

1200 డాలర్లు తీసుకుంటాను అన్నాడు డాక్టర్...

అబ్బే, మరీ ఎక్కువ అన్నాడు యాదగిరి...

అనస్తీషియా ఇచ్చి, జాగ్రత్తగా పన్ను పీకేయాలి, సో, రేటు ఎక్కువే అని చెప్పాడు డాక్టరు...

ఇంకేమైనా చౌకగా పని పూర్తయ్యే మార్గం లేదా డాక్టర్ అనడిగాడు యాదగిరి... సుల్తాన్‌బజార్ బేరం తరహాలో...

డాక్టర్‌కు ఈ బేరం చిర్రెత్తి, అనస్తీషియా ఇవ్వకుండా పీకేస్తా, నొప్పి భరించగలిగితే వెంటనే వచ్చి ఈ కుర్చీలో కూర్చో, 300 డాలర్లు ఇవ్వు చాలు అన్నాడు కోపంగా...

వోకే, దానిదేముంది, హైదరాబాద్ రోడ్ల మీద టూవీలర్ నడిపిన వాడిని, ఈ నొప్పులు గిప్పులు జాన్తానై అంటూ యాదగిరి వెంటనే కుర్చీలో కూర్చున్నాడు,..

డాక్టర్ పన్ను పీకేశాడు, అంతసేపూ యాదగిరి అలాగే నిర్వికారంగా కూర్చున్నాడు తప్ప కిమ్మనలేదు... నొప్పి కలుగుతున్న ఫీలింగ్ కూడా లేదు మొహంలో... పైగా ఒకటీరెండుసార్లు చిరునవ్వినట్టు కూడా అనిపించింది...

డాక్టర్ మహాశ్చర్యపోయాడు...

మిస్టర్ యాదగిరీ, నొప్పిని నియంత్రించుకోవడంలో, భరించడంలో మీ నేర్పు, ఓర్పు సూపర్బ్... ఎంతో సాధన మీద గానీ సాధ్యపడదు... మీరు 300 డాలర్లు ఇవ్వనక్కర్లేదు, మిమ్మల్ని అభినందిస్తూ నేనే మీకు 500 డాలర్లు ఇస్తున్నాను అన్నాడు ఆ డెంటిస్ట్... ఇచ్చాడు, యాదగిరి డాక్టర్ వంక అదోలా చూస్తూ వెళ్లిపోయాడు...

సాయంత్రం ఎప్పటిలాగే ఓ క్లబ్బులో తోటి డెంటిస్టులతో మాట్లాడుతూ... ‘‘అలాంటి అసాధారణ వ్యక్తుల్ని నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ యాదగిరి నొప్పిరహిత పన్నుపీకుడు ఎపిసోడ్ మొత్తం చెప్పాడు ఆయన...

వెంటనే మరో డెంటిస్టు అదిరిపడి ఇలా చెప్పాడు... ‘‘వార్నీ, వాడు అసాధ్యుడురా బాబూ... ముందు నా దగ్గరకు వచ్చాడు... అడిగిన రేటు ఇచ్చేస్తానన్నాడు... అనస్తీషియా ఇచ్చి, బయట అరగంట కూర్చోమన్నాను... ఆ తరువాత పిలిస్తే రాలేదు, బయటికొచ్చి చూస్తే లేడు...’’
.
.
(ఎప్పటిలాగే ఓ ఇంగ్లిషు సోషల్ పోస్టుకు స్వేచ్ఛానువాదం)

Discussion (0)