Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది

ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది

sivakiran

ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది- అని చెప్పిన గురజాడ జయంతి నేడు.

Alt Text
బాల్య వివాహాలు, కన్యాశుల్కం తదితర సాంఘిక దురాచారాలను ఖండించిన వాడు!

కన్యాశుల్కం అద్భుత నాటక రచన ద్వారా కీర్తిని పొందిన వాడు!

వేశ్యగా పిలువబడే మధురవాణి పాత్రను అత్యంత ప్రతిభా వంతంగా రూపొందించిన వాడు!

కన్యాశుల్కం సినిమాలో మహానటి సావిత్రి గొప్పగా పోషించిన మధురవాణి పాత్ర అసలు రూపకర్త అయిన వాడు!

గిరీశం వంటి ఆధునికపు మాటలు, అభ్యుదయపు మాటలు చెప్పే మోసకారులు , బూటకపు వ్యక్తులు సమాజంలో వుంటారని ఎంతో ముందుగా తన రచనల ద్వారా మనలను హెచ్చరించిన వాడు!

పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
గేయం ద్వారా మన మనసులను ఆర్ద్రతకు గురి చేసిన వాడు!

తెలుగు మొదటి కథగా చెప్పబడిన “దిద్దుబాటు” కథారచయిత అయిన వాడు!

వంటింటి నుంచి ఇల్లాలికి విముక్తి కలగాలన్న దార్శనికుడు.

తన రచనలలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వాడు!

మంచియన్నది మాల అయితే నే మాల నగుదున్ అని చెప్పిన వాడు!

కుల మత భేదాలను,
అంటరాని తనాన్ని దురాచారాలను ఖండించిన వాడు!

మన దేశం నుండి బౌద్దం ఎప్పుడు తరిమివేయ బడిందో
అప్పుడే దేశ పతనం మొదలయింది అని చెప్పిన వాడు!

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనషులోయ్!
అని చెప్పి
దేశభక్తికి నిజమైన అర్ధం చెప్పిన వాడు

దేశమంటే భూమి కాదు మనుషులు
అని చెప్పి
కుహనా దేశభక్తుల చెంప పగలగొట్టిన వాడు!

వాడుక భాషా వుద్యమంలో గిడుగుకి తోడ్పాడుగా నిలచి
ఆ పతాకను చేబట్టి వాడుక వుద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళిన వాడు!

మహాకవి శ్రీశ్రీ చేత తన ఆరాధ్యుడిగా ప్రకటించ బడిన వాడు!

వామపక్ష, దళిత , బహుజన కవి శివసాగర్ అలియాస్ సత్యమూర్తి తన కవితా మార్గానికి ఆదర్శ కవిగా పేర్కొన బడిన వాడు!

గొప్ప కవిత చెల్లీ చెంద్రమ్మకు
ప్రేరణ కవిత పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని శివసాగర్ తో కొనయాడ బడిన వాడు!

ముత్యాల సరాలతో
సరళ , లలిత కవితకు
పట్టం కట్టిన వాడు!

ఆధునిక కవులందరికీ

  • అరసం, విరసం, జనసాహితీ, అరుణోదయ , నవోదయ తదితర కవులందరికీ స్ఫూర్తి దాయకుడు!

నూతనతరం కవులందరికీ
అడుగుజాడను
ఏర్పరచిన వాడు!

ఆధునిక స్త్రీ చరిత్రను
పునర్లిఖిస్తుంది అని చెప్పినవాడు!

ఎవరు?
ఇంకెవరు?

అడుగుజాడ
అయిన గురజాడే!

మహాకవి గురజాడ అప్పారావు గారే!

జోహార్! గురజాడ అప్పారావు
జోహార్! జోహార్!

Discussion (0)