Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

శుభాకాంక్షలు

sivakiran

🕉️ ప్రపంచవ్యాప్తంగా
ఏ ముస్లిం కూడా "హ్యాపీ ఈద్" అని అనడు. వారందరూ "ఈద్ ముబారక్" అని మాత్రమే చెబుతారు.

క్రైస్తవులు ఎవరూ "హ్యాపీ క్రిస్మస్" అని అనరు. వారు కూడా "మెర్రీ క్రిస్మస్" అని మాత్రమే చెబుతారు.

హ్యాపీ దీపావళి
హ్యాపీ నవరాత్రి
హ్యాపీ దసరా
హ్యాపీ పుట్టినరోజు
హ్యాపీ హోలీ
కేవలం మన హిందువులం మాత్రమే అలాంటి సందేశాలను పంపుతాము ఎందుకంటే మనకు
🔥దీపావళి శుభాకాంక్షలు
🔥🔥దసరా శుభాకాంక్షలు
🔥🔥🔥పుట్టినరోజు శుభాకాంక్షలు

అలాంటి మాటలు చెప్పడం వెనుకబడినట్లు అనిపిస్తుంది.
మరియు ప్రజలు మమ్మల్ని నిరక్షరాస్యులు లేదా పల్లెటూరువాళ్ళం అని తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం కూడా ఉండవచ్చు.

ఇది ఎందుకు జరుగుతోంది? 😡

దీనికి ఏకైక కారణం మన పిల్లలకు ధార్మిక విద్య మరియు భారతీయ సంస్కృతిని ఇవ్వలేకపోవడమే. మన భాషపై మన సంస్కృతి గురించి గర్వపడాలి. భాష మన గుర్తింపు.
మేము ఇంగ్లీష్ తెలుగు మిశ్రమ భాష మాట్లాడతాము. ఎందుకు? మన భాష మనకు రాకపోవడం వల్లనా?

ముస్లిం, క్రైస్తవ మతస్తులు వారి వారి పండుగలు, ముఖ్యమైన రోజులకు ఈ ‘హ్యాపీ’ అనే పదాన్ని జోడించడం లేదు. హ్యాపీ బక్రీద్, హ్యాపీ ఈస్టర్ వంటి ప్రయోగాలు మనం ఎప్పుడైనా విన్నామా? అయితే మరి ఇంగ్లీషు వారు కూడా పవిత్రమైన పండుగలకు/దినములకు వాడని ఈ హ్యాపీ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? బహుశా వ్యక్తిగత ప్రత్యేక సందర్భాలకు మాత్రమే వారు దీనిని వాడుతున్నట్లు ఉన్నారు. ఉదాహరణకు హ్యాపీ బర్త్ డే, హ్యాపీ anniversary, ఇలాంటివాటికన్న మాట. దానిని తీసుకొని మనం అన్నింటికీ ఆపాదించేస్తున్నామన్నమాట.

ఇంతకూ హ్యాపీ అనే పదం 14వ శతాబ్దంలో ‘అదృష్టం కొలదీ’ (Favored by luck) అనే అర్థంలో మొట్టమొదటిసారిగా వాడబడినదని, అంతకు ముందు ఆ పదమే లేదని మీలో ఎంత మందికి తెలుసు?

శుభాకాంక్షలు = శుభ + ఆకాంక్షలు = అంటే శుభాన్ని కోరుకోవడం అన్నమాట. ఇంతకూ ఆ ‘శుభ’ అనే పదానికి ఉన్న అర్థం ఏమిటి అని డిక్షనరీలో చూస్తే, అనేక్ అర్థాలలో క్రింద చూపినవి కొన్ని మాత్రమే ...

• auspicious, fortunate, prosperous – మంగళకరమైనది, శోభనకరమైనది
• splendid, bright, beautiful, handsome - సుందరమైనది
• pleasant, agreeable, suitable, fit, capable, useful, good, welfare, luck, bliss – విలాసమైనది (శీలము, సొంపు, సొగసు, శోభ కలిగినది)
• good, righteous, virtuous, honest, pure, Happy, well, right - సౌభాగ్యకరమైనది,
• eminent, distinguished - వరప్రదమైనది

చూశారా, ‘శుభ’ అనేది ఎంత విశాలమైన అర్థం కలిగివుందో? విశాలమైన అర్థమే కాదు, ‘శుభ’ అనే పదానికి చాలా విశాలమైన చరిత్రకూడా వుంది. ఈ పదాన్ని వాల్మీకి రామాయణ, వ్యాస మహాభారత, భవిష్యపురాణ, శ్వేతాశ్వతర ఉపనిషత్, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతులలో కూడా వాడబడినది. అలాంటి పదాన్ని వదలిపెట్టి, ఇంగ్లీషువారు కూడా పవిత్రమైన, సార్వజనీనకమైన సందర్భాలలో వాడడానికి ఇష్టపడని హ్యాపీ అనే పదాన్ని తెచ్చిపెట్టుకుని అనవసరంగా మన నెత్తిమీద మోస్తున్నామో?

మన ధర్మం భాషతో ముడిపడి ఉంది. మన సంస్కృతి భాషతో అనుసంధానించబడి ఉంది.

ఎవరైతే వారి భాషను రక్షించుకుంటారో వారి ధర్మం మరియు సంస్కృతి సురక్షితంగా ఉంటాయి. ఎవరి ధర్మం మరియు సంస్కృతి సురక్షితంగా ఉంటాయో వారు, వారి వారసులు సురక్షితంగా ఉంటారు.

ఇంకా ఆలస్యం కాలేదు.
ఈ రోజు నుండి ప్రారంభించండి.
మీరు సందేశం పంపాలనుకుంటే, వ్రాయండి ఇలా:-
🌹🌹దీపావళి శుభాకాంక్షలు.
లేదా
🌹🌹శుభ దీపావళి అని.
🌹🌹సంక్రాంతి శుభాకాంక్షలు
లేదా
🌹🌹శుభ సంక్రాంతి.

మీరు మేల్కొన్నప్పుడే మన జాతికి ఉదయం!
ఈరోజు ప్రారంభిస్తే, రేపు అన్నీ చేస్తాం!!

శుభం భూయాత్ !

(మళ్ళీ ‘శుభం భూయాత్’ను ఇంగ్లీషులో ‘హ్యాపీ భూయాత్’ అని వ్రాసే ప్రయత్నం చేయకండి. ఏ భాషలోనైనా సరే దాన్ని ఉన్నదున్నట్లుగా ఏమాత్రం సంకోచించకుండా వాడేయండి!)

మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు పరిచయస్తులకు ఈ సందేశాన్ని పంపడమే కాకుండా వారు కూడా మరింత మందికి పంపించేలా ప్రోత్సహించండి.

Discussion (2)

Collapse
Sloan, the sloth mascot
Comment deleted
Collapse
Sloan, the sloth mascot
Comment deleted