Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

పెళ్ళాం ప్రాముఖ్యత

sivakiran

పెళ్ళాం ప్రాముఖ్యత

సుబ్బారావు గారు ప్రతిరోజూ ఆఫీస్ కి బయలుదేరే సమయానికి ఆయన భార్యామణి ' ఏమండీ మీరు తాళాలు మరచిపోయారనో మీ పర్స్ వదిలేశారనో, మీ వాచి పెట్టుకోవడం మరచారనో ఏదో ఒకటి గుర్తుచేస్తూనే వుంటుంది.
సుబ్బారావు గారికి ఇబ్బంది మొదలైంది. ఈసారి ఎలాగైనా ఏది మరచిపోకుండా వుండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ముందు రోజు రాత్రి తను తీసుకెళ్లే వస్తువుల సూచీ తయారుచేసుకుని జేబులో పెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయాన్నే లేచి తయారయ్యి రాత్రి తయారుచేసిన లిస్ట్ ప్రకారం బాగ్ లో వేసుకొనేవి బాగ్ లోనూ, వంటికి ధరించేవి శరీరానికి ధరింపజేసి బండి కిక్ కొట్టే సమయానికి లోపలనుండి భార్యామణి ఏమండోయ్ ఆన్న కమ్మని, శ్రావ్యమైన కంఠస్వరం బోయింగ్ 777 శబ్ద స్థాయిని దాటి వినపడింది.
ఉలిక్కిపడినా, తేరుకుని ' ఏమోయి ధర్మపత్ని , ఈరోజువరకు నీనుండి నాకు లభించిన సహకారానికి ధన్యవాదములు. ఈరోజున ఏది మరచిపోలేదోయి' అన్నాడు.
భార్య తన మధురమైన కంఠ ధ్వనిని ఉచ్చ స్థాయినుంచి, మంద్ర స్థాయికి మార్చి ' చాలులే నీ బడాయి చెలికాడా, వెనక్కి వచ్చి విశ్రమించండి. ఈరోజు ఆదివారం కదా.
సుబ్బారావు కి తన జ్ఞాపక శక్తి మీద కొంచెం నమ్మకం సడలింది, భార్య జ్ఞాపక శక్తి పై నమ్మకం పెరిగింది.

స్నేహితులారా, ఏమైనా పెళ్ళాల గొప్పదనం పెళ్ళాలదే!?....😜😜😜😝 ప్రెండ్స్..

ఈ కథ వినోదం గా భావించండి.. మిత్రులారా..

🌷

Discussion (0)