Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for అవనీ చక్రం ఆగిపోయిన వేళ...

అవనీ చక్రం ఆగిపోయిన వేళ...

sivakiran

'అవనీ చక్రం ఆగిపోయిన వేళ...

2021 సంవత్సరం అక్టోబర్ నెల నాలుగో తేదీ.... రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం.Alt Text

సెల్ ఫోన్ లో తదేకంగా వాట్సప్ చూస్తున్న శ్రీహరికి ఒక్కసారి షాక్ కొట్టినట్లయింది!అంతలో నే ప్రపంచమంతా శూన్యమై పోయినట్టు అనిపించింది!! .. ఏం జరిగిందో అర్థం కాలేదు . మతిపోయిన వాడిలా కుర్చీ లోంచి లేచి గది బయటకు వచ్చాడు. Alt Text
బైట హాల్లో సుమారు పాతికేళ్ళ యువకుడు అల్మారాలో పుస్తకాలు సర్దుతున్నాడు. "ఎవరు మీరు?" అడిగాడు శ్రీహరి. ఆ యువకుడు మాట్లాడలేదు. అంతలోనే వంటింట్లోంచి బయటకు వచ్చిన వరలక్ష్మి "ఎవరి గురించి మీరు అడుగుతున్నారు?" అంటూ అడిగింది భర్త వంక చూస్తూ.
" అదిగో ఆయన..." అంటూ అటువైపు వేలుపెట్టి చూపించాడు.
" వాడు సత్యం అండీ..." "అదేమిటి అంత పొడుగ్గా ఉన్నాడు? వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా?..." అన్నాడు అయోమయంగా చూస్తూ.
" వాడిది బిటెక్ అయిపోయింది.. ఈ మధ్య నే విప్రో లో ఉద్యోగం లో చేరాడు కదా..."అంది భర్త వంక గాభరాగా చూస్తూ.
అంతలోనే అటుగా పాక్కుంటూ వచ్చిన పాపను చూసి "ఈ పిల్ల ఎవరు?" అంటూ అడిగాడు.
" మన సుగుణమ్మ కూతురండీ" అంది
" అవునా... సుగుణ కి పెళ్ళయిపోయిందా?" అని వింతగా అడుగుతూవుంటే వరలక్ష్మి గొల్లుమంటూ ఏడుపు ఆరంభించింది. "మీరు... ఎందుకు అలా ఏడుస్తున్నారు?... ఇంతకీ మీరెవరు?" అంటూ అడిగాడు శ్రీహరి.
వరలక్ష్మి ఏడుపును తారాస్థాయికి పెంచి తరవాత తగ్గించి, నోట్లో చీర కొంగు కుక్కుకుంటూ " నేను మీ భార్య వరలక్ష్మినండీ... నాలుగేళ్ళ క్రితం మీరు రిటైర్ అయిన కొత్తలో పిల్లలు మీకు ఆ స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి మీరు వాట్సాప్ లోకి వెళ్ళిపోయి ఈవేళ బయటికి వచ్చారు. నేను మీ భార్యనే..నా మాట నమ్మండి." అంది ముక్కు చీదుకుంటూ.
"మరి నువ్వు నా భార్య వరలక్ష్మివే అయితే నీ జుట్టు నిగనిగలాడుతూ నల్లగా ఉండేది కదా....మరి అలా తెల్లగా ముగ్గు బుట్ట లా ఉందేమిటి?"Alt Text
" మీరు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుని నాలుగేళ్లు దాటిపోతోంది అని చెబుతున్నాను కదా.. ఈలోగా నా జుట్టునెరిసిపోయింది."అంది. "అలా అబధ్ధాలు చెప్పకు.. మరి... నేను ఇందులో రోజూ తెలుగు టీవీ సీరియల్స్ కూడా చూస్తాను! అన్ని సంవత్సరాలయినా 'కార్తీకదీపం' లో హీరో హీరోయిన్లు జుట్టు నెరిసి పోకుండా అలాగే ఉన్నారు కదా.. మరి నీ జుత్తు ఎలా నెరిసి పోయింది? నువ్వు నా భార్య వరలక్ష్మివి అంటే నేను
నమ్మను!"అన్నాడు శ్రీహరి. వరలక్ష్మి నిలువు గుడ్లు వేసుకుని భర్త వంక చూస్తూ ఉంటే , సత్యం వచ్చి " అమ్మా నువ్వు గాభరా పడొద్దు! రేపు ఉదయాన్నే నాన్న గారిని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్దాం!" అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు.Alt Text
రాత్రంతా భర్త ఆరోగ్యం గురించి దేవుళ్ళకి మొక్కు తూనే ఉంది వరలక్ష్మి. తెల్లారి ఐదు గంటలకి లేచి చూసేసరికి, చేతిలో స్మార్ట్ ఫోన్ తో విప్పారిన నవ్వు ముఖంతో, వాట్స్అప్ చూసుకుంటున్న భర్త ని చూశాక ఆమె గుండెలు కుదుట పడ్డాయి!!


Discussion (0)