Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

భూమాత..!

Savyasachi

నల్లమబ్బు షికారుకేగి
పంట బయల్లను చేరి
చిరుచినుకులతో పలుకరిస్తే
తన కరుణను కురిపిస్తే
పల్లెంతా ఆనందం
అంబరంతాకేంత సంబరం..!

అదే మబ్బు ఊరంతా
కసిరి ముసురేసి
కరకు గర్జనలు చేసి
కరాళనృత్యం చేస్తే
పల్లెంతా కలకలం
ఊరంతా దైన్యం..

ప్రకృతి కరుణిస్తే వరం
కన్నెర్రచేస్తే శాపం
కాపాడుకుంటే మోదం
లేకుంటే తప్పదు శోకం.‌..!

  • మీ సవ్యసాచి

Discussion (0)