Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

విమానం!!

Savyasachi

విమానం!!
రాజహంసను మించిన నీ భారీ ఆకారం
మేఘాలతో పోటీపడే నీ వేగం
విశాల నింగి వేదికపై నీవు చేసే ప్రతీ ప్రయాణం,
మానవుడి విజ్ఞానపు విశ్వరూప‌ దర్శనం...

20వ శతాబ్దంలో నీవో అద్భుతం,
మానవళి అభివృద్ధికి నీవు చూపావో కొత్త మార్గం..

అంతెత్తున ఆకాశంలో రెక్కలు విప్పుకొని
నీవు చేసే విన్యాసం
కొత్త అనుభూతులనేవో మనస్సున
నింపుతున్నదన్నది నిజం..

గగనసీమలపై రివ్వుమని ఎగిరే నీ నైజం,
మాకందరికీ నీ ప్రయాణమో మరవలేని జ్ఞాపకం..

  • మీ సవ్యసాచి

Discussion (0)